నామినేషన్ స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా రిటర్నింగ్ అధికారులు చూడాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: గురువారం నూతనకల్ మండల కేంద్రంలోని ఎం ఆర్ సి భవనం, మిర్యాల , ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలలో మొదటి విడత గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక నిమిత్తం ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎస్పి కే నరసింహ తో కలిసి ఆయన పరిశీలించారు. నూతనకల్ ఎం ఆర్ సి భవనంలో నూతనకల్, వెంకేపళ్లి, యెడవల్లి, చిల్ప కుంట్ల గ్రామపంచాయతీ సర్పంచులకు, వార్డు సభ్యులకు నామినేషన్ సేకరించడం జరుగుతుందని అలాగే మిర్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో మిర్యాల, అల్గునూరు, లింగంపల్లి,మాచనపల్లి గ్రామపంచాయతీ సర్పంచులకు వార్డు మెంబర్లకు, ఏపూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏపూరు, ఏపూరు తండా, బొప్పారం,కాశిగూడెం, మక్త కొత్తగూడెం, రామన్నగూడెం, మిడ్తనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు, వార్డు సభ్యులకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
నామినేషన్ స్వీకరణ కేంద్రంలోకి అభ్యర్థి తో పాటు మరో ఇద్దరినీ మాత్రమే అనుమతించాలని అలాగే వాహనాలు 100 మీటర్ల దూరంలోనే ఆపేయాలని ఆదేశించారు. అభ్యర్థులకు నామినేషన్ ప్రక్రియ లో ఎలాంటి సందేహాలు ఉన్న హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవాలని, ఏలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు.
గ్రామాల వారీగా స్వీకరించిన నామినేషన్ పత్రాలను వేరు వేరుగా భద్రపరచాలని సూచించారు. కలెక్టర్ తో డి.ఎస్.పి ప్రసన్న కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ లు సునీత, మహ్మద్ హసీం, ఆర్ ఓ లు,అధికారులు తదితరులు ఉన్నారు.

