జిల్లాలో మొదటి దశ గ్రామ పంచాయితీ నామినేషన్ స్వీకరణ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని ఆదేశించిన……….. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
సాక్షిత వనపర్తి
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశలో భాగంగా ఐదు మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో గోపాల్పేట మండల పరిధిలో గోపాల్పేట, తాడిపర్తి, బుద్ధారం, పెద్దమందడి మండల పరిధిలో పామిరెడ్డిపల్లి, వీరాయిపల్లి గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
వీరాయపల్లిలో కలెక్టర్ తో పాటు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ మల్లయ్య బట్టు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య కూడా పాల్గొని నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిశీలకులు నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఓటర్ జాబితాను ప్రదర్శించాలని సూచించారు. అని నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఫారం 1 ప్రచురణ చేశారా లేదా అని కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతిరోజు నామినేషన్లను స్వీకరించిన అనంతరం సాయంత్రం టీ పోల్ యాప్ లో అప్డేట్ చేయాలని సూచించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు ఒక ప్రపోజల్ మరొక వ్యక్తి మొత్తం ముగ్గురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలోకి అనుమతించాలని సూచించారు.
ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నామినేషన్ వేసిన అభ్యర్థులకు ఎక్స్పెండిచర్ బుక్లెట్ ఇచ్చినప్పుడు ధ్రువీకరణ చేసి ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు.
గోపాల్పేట తహసిల్దార్ తిలక్ రెడ్డి, ఎంపీడీవో అయేషా, పెద్దమందడి తహసిల్దార్ పాండు నాయక్, ఎంపీడీవో తాళ్ల పరిణత, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
