కార్మికులకు అండగా నిలుస్తున్నందుకు ఆనందంగా ఉంది

Sakshitha news

కార్మికులకు అండగా నిలుస్తున్నందుకు ఆనందంగా ఉంది
**ఆపద్బాంధవుడుగా నిత్యం కార్మికులకు న్యాయం చేస్తున్న…

-బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి

సాక్షిత , సనత్ నగర్

సనత్ నగర్ ఇండస్టీ ఏరియాలో
” విద్యా బిలియన్ ఎల్.ఎల్.పి ఇండస్ట్రియల్ ఎస్టేట్” హైదరాబాద్ కంపెనీలో సాయిరాం అనే కార్మికుడు గత కొన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. కంపెనీ యజమాన్యం ఎలాంటి కారణం లేకుండా వెంకట సాయి రామ్ ను కావాలని కంపెనీలో నుంచి తీసివేయడం జరిగింది. వెంకట సాయి రామ్ కి 15 రోజుల వేతనం, అలాగే ఒక్క నెల నోటీస్ పేమెంట్ మొత్తం 58,000/- వేల రూపాయలు రావాల్సి ఉండగా… అవి ఇవ్వకపోవడంతో…కంపెనీ యాజమాన్యంని జీతం డబ్బులు ఎన్నిసార్లు అడిగినా వెంకట సాయిరాం పట్ల నిర్లక్ష్యం వహించింది. కంపెనీ యజమాన్యం పట్టించుకోవడం లేదు అని తెలుసుకొని అడిగి అడిగి విసుగు చెందిన కార్మికుడు వెంకట సాయి రామ్ కి ఏం చేయాలో అర్ధం కాక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎవరైతే కార్మికులకు న్యాయం చేస్తారని తోటి కార్మిక మిత్రుల ద్వారా తెలుసుకొని, బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి ఆవార్డు గ్రహీత రవి గురించి తెలుసుకొని… బీఆర్టీయూ కార్యాలయం వద్దకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించాడు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవి హుటాహుటిన “విద్య బిలియన్ ఎల్ ఎల్ పి ఇండస్ట్రియల్ ఎస్టేట్” కంపెనీ వద్దకు బయలుదేరి యజమాన్యంతో పలుమార్లు చర్చించి కార్మికుడికి రావలసిన 15 రోజుల వేత్తనంతో పాటు అలాగే ఒక్క నెల నోటీస్ పేమెంట్ మొత్తం కలిపి 58,000/- వేల రూపాయలు ఇప్పించడం జరిగింది. కార్మికుడు వెంకట సాయి రామ్ మాట్లాడుతూ… న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
కార్మికులకు అండగా ఉండడం ఆనందంగా ఉందని
బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి తెలిపారు. ఆపదలో ఉన్నవారికి… అన్యాయం జరిగిన వారికి అండగా ఉండడం సంతృప్తిని ఇస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్, పాల్గొన్నారు.

Scroll to Top