జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పరిశీలన
- కాంగ్రెస్ కార్యకర్తలను అభినందించిన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్
సాక్షిత , కూకట్పల్లి
టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని వెంగళరావునగర్ మధుర నగర్ లలో స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. అక్కడ ఉప ఎన్నిక ఓటింగ్ సరళి ఆయన పరిశీలించారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లతో ఆయన మాట్లాడారు. ఓటింగ్ సమయంలో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా..? అంటూ వారిని ప్రశ్నించారు.
పార్టీ కార్యకర్తలకు ఓటు వేసే విషయంలో అవసరమైన సలహాలు సూచనలు అందజేశారు. పార్టీకి చెందిన ఓట్ల తో పాటు తటస్థ ఓట్లను పార్టీకి పడేలా చూడాల్సిందిగా కార్యకర్తలకు ఆయన సూచించారు. మొత్తం మీద ఉప ఎన్నిక సజావుగా, శాంతియుత వాతావరణంలో ముగిసేలా పార్టీ కార్యకర్తలు కృషి చేసినందుకు ఆయన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తూము వేణు, కృష్ణ రాజపూత్, ప్రకాష్, అస్లాం, రాజు తదితరులు ఉన్నారు.

