మాజీ ఎమ్మెల్యే, గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నర్సారెడ్డి ని పరామర్శించిన దోర అరుణ్
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకుడు దోర అరుణ్ NIMS ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రెహ్మాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ సమీర్ అహ్మద్ తో కలిసి నర్సారెడ్డి ని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా దోర అరుణ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో హింసకు, బెదిరింపులకు ఎలాంటి స్థానం లేదన్నారు. గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండే, వారి సమస్యలను అసెంబ్లీలో బలంగా వినిపించే, ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాప్రతినిధి అవసరమని అన్నారు.
“KCR అసెంబ్లీకి వచ్చి గజ్వేల్ ప్రజల గొంతుకగా నిలబడాలి. లేదా రాజీనామా చేసి, ప్రజలకు అందుబాటులో ఉండే మరో నాయకుడికి అవకాశం ఇవ్వాలి” అని దోర అరుణ్ అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, ప్రతి నాయకుడి పనితీరును ప్రజలు ప్రశ్నిస్తారని, లెక్కలు అడిగి ప్రజాస్వామ్య పద్ధతిలో తీర్పు ఇస్తారని పేర్కొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST