పేదలకు రూ.230కే సిమెంట్, తక్కువ ధరకే స్టీల్: మంత్రి పొంగులేటి
తెలంగాణ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా పేదలకు సిమెంట్ బ్యాగును రూ.230కే అందించేలా కంపెనీలతో ఒప్పందం కుదిరిందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో రూ.310-320 ఉన్న సిమెంట్ బ్యాగును తక్కువ ధరకే అందిస్తామని, స్టీల్‌ను కూడా తక్కువ ధరకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేలా, వారు నివసించే ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇతర నియోజకవర్గాలకు చెందినవారు డ్రాలో ఎంపికైతే తొలగిస్తామని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి వివరించారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST