కిరణ్ కార్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ మల్లంపేట్ లోని కేవీర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కిరణ్ కార్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలను అందించి వారి నుండి మన్ననలు పొంది వారి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, అర్కల అనంత స్వామి ముదిరాజ్, జక్కుల శ్రీనివాస్ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, టాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, నాయకులు జలిగం రాకేష్, కుంట్ల నందు, ఈ శ్రీనివాస్, యువ నాయకులు మాదాస్ ఆదిత్య, అనిల్ రెడ్డి, మల్లేష్, నిర్వాహకులు బెజ్గాం శ్రీనివాస్ గుప్తా, మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు..

