హైదరాబాద్ విలీనం సిపిఐ వల్లే.సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

Sakshitha news

హైదరాబాద్ విలీనం సిపిఐ వల్లే.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

   భారతదేశం అంతట మువ్వన్నెల జండా ఎగురవేసి సంబరాలు చేసుకుంటుంటే నిజం యేలుబడిలోని హైదరాబాద్ సంస్థానం లోని ప్రజలు కట్టు బానిసలుగా ఇబ్బంది పడుతుంటే హైదరాబాద్ సంస్థానం భారతదేశం లో విలీనం చెయ్యాలని కోరుతూ కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి 4500 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాలను పేదలకు పంచి తెలంగాణ ను భారతదేశంలో విలీనం చేయించిన చరిత్ర సిపిఐ కె ఉందని సాయుధ పోరాట చరిత్రను ప్రజలకు తెలియచెయ్యాల్సిన అవసరం కర్తవ్యమ్ సిపిఐ కార్యకర్తలకు ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ అన్నారు.

  సాయుధ పోరాట పిలుపునిచ్చి నేటికీ సరిగ్గా 80 సంవత్సరాలు కావస్తున్న కారణంగా సాయుధ పోరాట వారోత్సవాలను నేడు ప్రారంభించడం జరిగింది.అందులో భాగంగా నేడు మఖ్డుం నగర్ నాగయ్య విగ్రహం దగ్గర కల అమరవీరుల స్తూపం దగ్గర  పూలదండలు వేసి నివాళులు అర్పించారు. సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లు పటేల్ సైన్యం వల్ల వచ్చిందని సాయుధ పోరాటాన్ని అవమానిస్తూ మన చరిత్రను గుజరాతీ వ్యక్తి కి గౌరవం తీసుకురావడం మన పోరాటాన్ని తగ్గిస్తున్నాయని అన్నారు.పటేల్ వచ్చాక నిజాం కాలంలో అరెస్టు అయ్యినవారిని,ఉరి శిక్ష పడ్డ వాళ్ళని విడిచిపెట్టలేదని చివరికి రాష్ట్రపతి వల్లే బయటకు వచ్చారని అన్నారు.సిపిఐ ఎక్కడ తెలంగాణ ను పరిపాలించి భూములను పంచితే భూస్వాములకు ఇబ్బంది గురయ్యే ప్రమాదం ఉందని గ్రహించే పటేల్ వచ్చారని అన్నారు.కావున తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరిస్తూ రాబోయే తరాలకు నిజమైన చరిత్ర చెప్పాల్సిన బాధ్యత మన పై ఉన్నదని అన్నారు.
     *ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఏసురత్నం,మండల కార్యదర్శి స్వామి,సహాయ కార్యదర్శులు హరినాథ్,రాములు,ప్రజానాట్యమండలి బాబు,సిపిఐ నాయకులు నర్సింహారెడ్డి, సహదేవరెడ్డి,వెంకటాచారి,వెంకటేష్,శ్రీనివాస్ చారీ, శ్రీనివాస్,పెంటన్న,కార్తీక్ 

యువజన నాయకులు జంబూ, ధర్మేంద్ర,సాహు,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు*