నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్

Sakshitha news

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 292 సాయిబాబా నగర్ డివిజన్‌లోని కృషి కాలనీలో దమ్ములూరి గణపతిరావు గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం గణపతిరావు కుటుంబ సభ్యులకు హన్మంతన్న శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన ఇంట్లో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి నిండాలని, వారి కుటుంబంలో జీవితాంతం ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు, బహదూర్‌పల్లి డివిజన్ అధ్యక్షులు మైసగారి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలేటి శ్రీనివాస్ రావు , భాస్కర్ రెడ్డి, బి. శ్యామ్, సత్తిరెడ్డి, రాజిరెడ్డి, ఆనంద్, అంజిరెడ్డి, బాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.