అజాత శత్రువు ఎల్లన్న..

Sakshitha news

అజాత శత్రువు ఎల్లన్న..

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఘనంగా ఎల్లన్న ప్రథమ వర్ధంతి

తెల్లాపూర్

తన చివరి శ్వాస వరకు కార్మికుల సంక్షేమం, హక్కులతో పాటు ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అంకితం చేసిన మహోన్నత నాయకుడు.. అజాత శత్రువు ఎల్లన్న అని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

శనివారం తెల్లాపూర్ పరిధిలోని జి ఎల్లయ్య ఎంక్లేవ్ లో కార్మిక నాయకుడు దివంగత ఎల్లయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై, ఎల్లన్న విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. నిరంతరం కార్మికుల హక్కుల, సంక్షేమం కోసం పోరాటం చేస్తూనే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎల్లన్న కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొంది అజాతశత్రువుగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్ యాదవ్, మల్లారెడ్డి, ఎల్లన్న కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.