స్వామిగౌడ్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నాయకులు

Sakshitha news

స్వామిగౌడ్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నాయకులు


సాక్షిత పెద్దపల్లి జిల్లా pra గోదావరిఖని: సిటీ కేబుల్‌ యాజమాన్యులు స్వామిగౌడ్‌ తండ్రి స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి సోమారపు లావణ్య, అరుణ్‌కుమార్‌ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా స్వర్గీయుల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. మృతుల కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాశం, రాజు, సురేష్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.