కళావతి నగర్‌లో మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన

Sakshitha news

కళావతి నగర్‌లో మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: 291వ డివిజన్ షాపూర్ నగర్ పరిధిలోని కళావతి నగర్‌లో మల్టీపర్పస్ హాల్ (కమ్యూనిటీ హాల్) నిర్మాణానికి రూ.18 లక్షల నిధులు మంజూరు కాగా, ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని మల్టీపర్పస్ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ, కళావతి నగర్‌లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పలకృష్ణ, సిద్ధనోళ్ల సంజీవ రెడ్డి, డీసీసీ సెక్రటరీ సంతోష్, గాదె వినోద్, కాలనీ సీనియర్ నాయకులు రజితా రత్నం, రజాక్, కృష్ణ, బుచ్చయ్య పతి, అచ్చమ్మ, నరసమ్మ, సంపంగి వెంకటేష్, అరుణ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.