|| లక్ష్మీనగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు లక్ష్మీనగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు పాల్గొని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని, అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నెం రాజు , డివిజన్ అధ్యక్షులు మైసి గారి శ్రీనివాస్ , డీసీసీ సెక్రటరీ సంతోష్ ముదిరాజ్ గారు, లక్ష్మీనగర్ కాలనీ ప్రెసిడెంట్ ఎన్. అమృతారెడ్డి , జనరల్ సెక్రటరీ హెచ్. హరిశంకర్ రావు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి , సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
