వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ మరో ఆరు నెలలు పొ డిగింపు

Sakshitha news

వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ మరో ఆరు నెలలు పొ డిగింపు.

ప్రత్తిపాటి స్వప్నంలోనూ టిడిపి సత్యానికే చైర్మన్ ఇవ్వాలని.

చిలకలూరిపేట :వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డ్ కమిటీ, చైర్మన్ పదవి కాలం ముగియటంతో కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల నేపథ్యంలో సంవత్సర కాలం పూర్తయిన వ్యవసాయ శాఖ యార్డు చైర్మన్ ల పదవి కాలం మరో ఆరు నెలలు పొడిగించారు. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట తో పాటు మాచర్ల,పిడుగురాళ్ల, ఈపూరు, నరసరావుపేటలకు సంబంధించిన మార్కెట్ యార్డ్ కమిటీలను ఇదే విధంగా ప్రకటించారు

చిలకలూరిపేట వ్యవసాయ శాఖ యార్డు,కమిటీ, చైర్మన్ పదవీకాలం జూలై నెలాఖరుతో ముగిసినప్పటికీ మరో ఆరు నెలలు పొడిగించడంతో యధావిధిగా కొనసాగుతూ సాగుతుంది. మరో ఆరు నెలల వ్యవధి దాటిన తర్వాత పట్టణంలోని పురుషోత్తపట్నం కాపు సామాజిక వర్గానికి చెందిన టిడిపి సత్యానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా షేక్ కరిముల్లా తర్వాత మీకు ఇస్తానని కాపు నాయకుల సమక్షంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపిన సంగతి అందరికీ విధితమే కాబట్టి ఆరు నెలలు పొడిగించడంతో ఆ తదుపరి టిడిపి సత్యానికి కేటాయిస్తారని పలువురు నాయకులు బహిర్గతంగానేచర్చించుకుంటున్నారు. .

*దీంతో ప్రతిపాటి స్వప్నంలోను టిడిపి సత్యనికి ఇవ్వాలనే ఆలోచన బలంగా ఉన్నట్లు పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సైతం చర్చించుకోవడం గమనార్హం