భక్తిశ్రద్ధలతో ఘనంగా పుట్టలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవం

Sakshitha news

భక్తిశ్రద్ధలతో ఘనంగా పుట్టలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవం

గుంటూరు రూరల్ మండలం, చల్లవారిపాలెం గ్రామం నందు వేంచేసియున్న పుట్టలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు .

ఈ సందర్భంగా శ్రీ పుట్టలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రభుత్వం చేత నియమింపబడ్డ 10 మందితో పుట్టలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం పాలకవర్గ సభ్యులను ప్రమాణస్వీకార చేయించిన ఎమ్మెల్యే .

ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ పుట్టలమ్మతల్లి అమ్మవారి ఆశీస్సులతో దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ పారదర్శకంగా సేవలందించాలని సూచించారు.నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి సేవలో అంకితభావంతో పనిచేసి దేవస్థానం ప్రతిష్ఠను మరింత పెంచాలని ఎమ్మెల్యే ఆకాంక్షిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో గర్వకారణం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. పుట్టలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం పాలకవర్గ సభ్యుల పేర్లు సుధా పిచ్చయ్య , శ్రీమతి మర్రిశెట్టి శివపార్వతి , వాస నాగేశ్వరరావు , శ్రీమతి చోడవరపు శ్రీవల్లి సుబ్బలక్ష్మి , పెద్ద పరుపు ప్రసాద్ , శ్రీమతి జానారపు భవాని , శ్రీమతి వి. అనురాధ , నల్లపాటి నాగేశ్వరరావు , శ్రీమతి అర్థాల శ్రీలక్ష్మి , డి రాంబాబు నియమింపబడ్డారు.

ఈ కార్యక్రమంలో గాదె వెంకటేశ్వరరావు ,ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top