విద్యార్థులు అప్రమత్తంగా ఉంటేనే మహిళల భద్రత సాధ్యం

Sakshitha news

విద్యార్థులు అప్రమత్తంగా ఉంటేనే మహిళల భద్రత సాధ్యం….

గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, సైబర్ మోసాలు, డ్రగ్స్‌పై అవగాహన….

–షీ టీమ్…

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో గోదావరిఖని మార్కండేయ కాలనీలోని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు షీ టీమ్ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా షీ టీమ్ ఇన్‌చార్జి ఎస్‌ఐ లావణ్య మాట్లాడుతూ విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, టీనేజ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచిత వ్యక్తులతో వ్యవహరించే విధానం, పోక్సో చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా ప్రభావం, విద్యార్థుల ప్రవర్తనా నియమాలు, మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్‌పై వివరించారు.

మహిళలు, విద్యార్థుల భద్రత కోసం ప్రతిరోజూ బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిఘా ఉంటుందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

మహిళలకు ప్రమాదం లేదా బెదిరింపులు ఎదురైతే వెంటనే 100/112కు, ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్ను వినియోగించాలని తెలిపారు.

కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ పద్మ, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top