సింగరేణి కార్మికులకు శుభవార్త.. తాడిచర్ల–2 బొగ్గు క్షేత్రం సింగరేణికే కేటాయింపు దిశగా కీలక ముందడుగు….

Sakshitha news

సింగరేణి కార్మికులకు శుభవార్త.. తాడిచర్ల–2 బొగ్గు క్షేత్రం సింగరేణికే కేటాయింపు దిశగా కీలక ముందడుగు….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:గోదావరిఖని,
సింగరేణి సంస్థ భవిష్యత్ అవసరాలు, దేశంలో పెరుగుతున్న బొగ్గు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని తాడిచర్ల–2 బొగ్గు క్షేత్రాన్ని సింగరేణి సంస్థకే కేటాయించే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో సింగరేణి కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనక్ ప్రసాద్ గతంలో పలుమార్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు క్షేత్రాల కేటాయింపు, కొత్త బహిరంగ గనుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా తాడిచర్ల–2 బొగ్గు క్షేత్రాన్ని సింగరేణికే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ విజ్ఞప్తిపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించి, సింగరేణి సంస్థ భవిష్యత్‌తో పాటు కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాడిచర్ల–2 బొగ్గు క్షేత్రాన్ని సింగరేణికే కేటాయించాలని నిర్ణయించినట్లు స్వయంగా డాక్టర్ జనక్ ప్రసాద్‌కు ఫోన్ ద్వారా తెలియజేసినట్లు వెల్లడించారు.

ఈ పరిణామంపై కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి. సంజీవ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అధికారిక ప్రకటన ఈ రోజు సాయంత్రం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

తాడిచర్ల–2 బొగ్గు క్షేత్రాన్ని సింగరేణి సంస్థకే కేటాయించే ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి సింగరేణి కార్మికుల తరఫున, కార్మిక సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Scroll to Top