మహిళల భద్రతే లక్ష్యం.. సమస్య ఉంటే వెంటనే షీ టీమ్‌కు సమాచారం ఇవ్వండి…
సాక్షిత : రామగుండం సీపీ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు….
మహిళల భద్రత, సైబర్ నేరాలు, యాంటీ డ్రగ్స్‌పై గ్రామస్తులకు సూచనలు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: జూన్-10.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ సభ్యులు పెద్దపల్లి మండలంలోని కనగర్తి, పాలితం గ్రామాల్లో గ్రామసభ కార్యక్రమంలో భాగంగా మహిళల భద్రత, చైల్డ్ సేఫ్టీ, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యురాలు స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. బస్టాండ్లు, ప్రధాన చౌరస్తాలు, జనసమ్మర్థ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తోందని తెలిపారు.
ఎవరైనా మహిళలు లేదా విద్యార్థినులు వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
అలాగే అత్యాశకు లోనై సైబర్ మోసాలు, ఆన్‌లైన్ ఫ్రాడ్లు, లోన్ యాప్స్ బారిన పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నా, బెదిరింపులు ఎదురైనా వెంటనే 100 లేదా 112 నంబర్లకు డయల్ చేయాలని సూచించారు. యాంటీ డ్రగ్స్‌పై కూడా అవగాహన కల్పిస్తూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
