సూర్యాపేటలో వాహనాల వేలం నిర్వహణకు ఏర్పాట్లు
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి
సూర్యాపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో సీజ్ చేయబడిన వాహనాల వేలం ఈనెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు ఎక్సైజ్ స్టేషన్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేలాన్ని జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్. లక్ష్మా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనదలచిన అభ్యర్థులు అదే రోజు ఉదయం 9 గంటల నుండి స్టేషన్కు వచ్చి ముందస్తుగా దరఖాస్తు రుసుము చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వేలంలో మొత్తం 6 వాహనాలు ఉండగా, వాటిలో ఒకటి టీవీఎస్ ఎక్స్ఎల్, నాలుగు ద్విచక్ర వాహనాలు (బైక్స్), ఒక త్రిచక్ర వాహనం (ఆటో) ఉన్నాయి. ఆసక్తి గల వ్యక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
