తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కారించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి .
ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
అలాగే, భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రజలతో మమేకమై పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి నినాదాలు చేస్తూ తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు.
