మొట్టమొదటిగా మహిళా ఎమ్మెల్యేగా కోవూరులో గెలుపొందానంటే అది మీ సహకారం..
సాక్షిత : ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేను ఓడించాను.
క్లస్టర్ఇన్చార్జిని పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమించిన ఘనత టిడిపికే దక్కుతుంది..
*హైబ్రిడ్ స్త్రీ శక్తి మహానాడు ను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..
నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఆరుసార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునే వ్యక్తిని ఓ మహిళ ఎమ్మెల్యేగా మొదట పోటీ చేసి భారీ మెజార్టీతో ఓడించాను అంటే దానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు తో పాటు నాయకులు, కార్యకర్తలు అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరు టిడిపి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. వర్చువల్ విధానంలో నిర్వహించిన స్త్రీ శక్తి మహానాడు ను విజయవంతం చేసిన ప్రతి నాయకునికి, కార్యకర్తకి ధన్యవాదాలు తెలిపారు. టిడిపికి కార్యకర్త బలమని, కార్యకర్త ఎదుగుదలకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది అన్నారు. టిడిపి మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తుందని అప్పట్లో ఓ మహిళ ఎమ్మెల్యేగా నాపై అంకిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కు సైతం బుద్ధి చెప్పారని దానికి అండగా ముఖ్యమంత్రి చంద్రబాబు,లోకేష్, టిడిపి నాయకులు, కార్యకర్తలు నిలిచిఉన్నారని.
క్లస్టర్ ఇంచార్జ్ మండల అధ్యక్షునికి పోలిట్ బ్యూరో సభ్యులుగా స్థానం కల్పించిన ఘనత ఒక టీడీపీకే దక్కుతుందన్నారు.మహానాడు నిర్వహణలో ప్రతి క్లస్టర్ను తాము పర్యవేక్షించామన్నారు. రానున్న స్థానిక ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు, సంసిద్ధంగా ఉండాలన్నారు. అలాగే ఓటరు నమోదు విషయాలలో గ్రామంలో పర్యవేక్షించాలన్నారు. దీనిపై “ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు” సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారని ట్రైనింగ్ తరగతులు అనంతరం ప్రతి మండలంలో నాయకులు, కార్యకర్తలతో, కలిసి దీనిపై చర్చించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, బుచ్చి చైర్పర్సన్ మోర్ల సుప్రజ, బెజవాడ వంశీకృష్ణ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, తాటిపర్తి విజయ్ కుమార్ రెడ్డి,నాప వెంకటేశ్వర్లు నాయుడు, గుప్తా శ్రీనివాసులు రెడ్డి, బెజవాడ జగదీష్,గాదిరాజు అశోక్, పాలూరు నాటక రాణి వెంకట్, పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
