అవ్వ, తాతలకు పెన్షన్లు పంపిణీ చేసిన మోర్ల సుప్రజ

Sakshitha news

అవ్వ, తాతలకు పెన్షన్లు పంపిణీ చేసిన మోర్ల సుప్రజ

సాక్షిత : నెల్లూరు జిల్లా కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాళెంమున్సిపాలిటీలోని 4వ వార్డు లో పింఛన్ పంపిణీచేసినబుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజ మురళి.ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ..బుచ్చిరెడ్డి పాళెం 4 వ వార్డ్ లో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని,లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందించి వారియోగక్షేమాలుతెలుసుకుంటూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్నికొనసాగించారు. మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆమె తెలిపారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి వృద్ధులకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు, మంచానికి పరిమితమైన వికలాంగులకు రూ.15వేలు అందిస్తున్నామని చెప్పారు. పింఛను పొందుతున్న లబ్ధిదారుల కళ్ళలో ఆనందం చూస్తే సంతోషంగా ఉందని, రాష్ట్రంలో ఖజానా ఖాళీగా వున్నప్పటికీ ముఖ్యమంత్రి అపార అనుభవంతో అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల హామీలను అమలుచేస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి తో పాటు మున్సిపల్ కమిషనర్ ఇనమల చినబాబు,నాలుగో వార్డ్ ఇంచార్జ్ మహేంద్ర నాథ్ రెడ్డి, టిడిపి నాయకులు, సుబ్బారెడ్డి, దశయ్య, యశ్వంత్, రమణారెడ్డి,వీఆర్వో కృష్ణవేణి, పాల్గొన్నారు.

Scroll to Top