బాలాజీ నగర్ లో చిన్నారి విద్యాపీఠ్ పాఠశాల ప్రారంభోత్సవం… విద్యా వ్యవస్థలో లోపాల సవరణే లక్ష్యం చిన్నారి విద్యాపీఠ్..*విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలి…
సాక్షిత :గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలావిద్యాసంస్థలు కృషి చేయాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు.
కోదాడలోని చిన్నారి విద్యాపీఠ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడమే లక్ష్యంగా చిన్నారి విద్యాపీఠాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు జానకిరామయ్య, కరస్పాండెంట్ హర్షిత్ వర్మ తెలిపారు.ప్రారంభ దశలో 200 మంది విద్యార్థులతో పాఠశాలనుప్రారంభిస్తున్నామని, ఆంగ్ల భాషా ప్రావీణ్యం పెంపొందించేందుకు మణిపూర్, అస్సాం రాష్ట్రాల నుంచి 50 శాతం మంది ఉపాధ్యాయులను నియమించినట్లు వెల్లడించారు.
హాస్టల్లో చేరే ప్రతి విద్యార్థికి అవసరమైన వ్యక్తిగత వస్తువులను స్కూల్ ఫీజులోనే అందించనున్నట్లు తెలిపారు.ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన ఆటస్థలం, పార్కింగ్, పూర్తి స్థాయి వెంటిలేషన్‌తో పాఠశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి పోషకాహారాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. సంప్రదాయ 45 నిమిషాల పీరియడ్‌కు బదులుగా గంటన్నర తరగతి సమయాన్ని కేటాయించి విద్యార్థుల భాగస్వామ్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు హర్షిత్ వర్మ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, చిలుకూరు సర్పంచ్ పుల్లమ్మ,కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, వివిధ విద్యాసంస్థల చైర్మన్లు, కరస్పాండెంట్లు, వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.
