ఎన్టిపిసి ఒప్పంద కార్మికుల గేట్ పాస్లు, పోలీస్ వెరిఫికేషన్పై కొత్త మార్గదర్శకాలు విడుదల…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: ఎన్టిపిసి, ఎన్టీపీసీ రామగుండం & తెలంగాణ మానవ వనరుల విభాగం (ఉద్యోగ సంబంధాలు) ఆధ్వర్యంలో ఒప్పంద కార్మికుల ప్రవేశం, నిష్క్రమణ, పోలీస్ వెరిఫికేషన్కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు.
ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని
ప్లాంట్ ప్రాంగణంలో భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
సీఐఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నుంచి అందిన భద్రతా సూచనలు, స్థానిక ఎన్టీపీసీ యాజమాన్య ఆమోదంతో ఈ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు.
కొత్త మార్గదర్శకాల ప్రకారం:
ఒప్పంద కార్మికులకు గేట్ పాస్లు గరిష్టంగా ఆరు నెలల కాలపరిమితితో మాత్రమే జారీ చేయబడతాయి.గేట్ పాస్ జారీకి చెల్లుబాటు అయ్యే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్, భద్రతా, వైద్య అనుమతులు తప్పనిసరి.ఒప్పంద కాలపరిమితి ముగిసిన తర్వాత గేట్ పాస్ పునరుద్ధరణ చేపడతారు.
కార్మికుల పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి లేదా గడువు ముగిసిన వెంటనే పునరుద్ధరించాల్సి ఉంటుంది.
తాత్కాలిక, స్వల్పకాలిక పనుల కోసం ప్రస్తుత విధానంలోనే సీఐఎస్ఎఫ్ గేట్ పాస్ విభాగం ద్వారా ప్రత్యేక అనుమతులు జారీ చేస్తారు.
ఈ మార్గదర్శకాలను అన్ని కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు తప్పనిసరిగా పాటించాలని ఎన్టీపీసీ సీనియర్ మేనేజర్ (హెచ్ఆర్) దీపక్ కుమార్ పాఠక్ సూచించారు.

