తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్……. నాగర్కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ బి రాములు

Sakshitha news

తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్……. నాగర్కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ బి రాములు

సాక్షిత వనపర్తి
తెలుగు జాతిఆత్మగౌరవానికి చిరస్మరణీయుడు తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక నందమూరి తారక రామారావు అని రామారావు నూట మూడవ జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి వనపర్తి పట్టణ కేంద్రంలోని హనుమాన్ టేకిడ్ అలాగే పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం నాగర్ కర్నూల్ పార్లమెంటు కన్వీనర్ బి.రాములు పై విధంగా కొనియాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవనే పరమార్ధంగా భావించి ప్రజా హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన మహా నాయకుడు ఎన్టీ రామారావుని ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతికి గుర్తింపు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావుని కొనియాడారు ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘ నాయకులు పట్టణ అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్య ఆవుల శ్రీను కొత్త గొల్ల శంకర్ డి బాలరాజ్ పి చంద్రశేఖర్ మేదరి బాలయ్య అప్పాయి పల్లి బాలయ్య శేఖర్ నక్క వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top