యువకుని హత్యకేసులో 3 నిందితుల అరెస్ట్.
సాంకేతిక ఆధారాలతో నేరస్తులను గుర్తించిన పోలీస్ బృందం.
కేసుల చేదనలో పోలీసులు సాంకేతిక నైపుణ్యంతో పని చేస్తున్నారు.
నేరాలకు పాల్పడితే ఏనాటికైనా చట్టపరిదిలో శిక్షలు తప్పవు.
ఈకేసులో నిందితులకు త్వరగా శిక్షలు అమలైయ్యేలా పని చేస్తాం..
కోదాడ డివిజన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి..*.
సాక్షిత:
ఈనెల 15వ తారీఖున కోదాడ రూరల్ పరిధి గణపవరం గ్రామ శివారులో జరిగిన యువకుని హత్యకు సంబందించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అత్యంత కటినముగా మారిన ఈ కేసును పోలీసులు భేదించారు అని కోదాడ డివిజనల్ డి.ఎస్.పి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి కోదాడ డి.ఎస్.పి. కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసు చేదన, నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు.
కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణపవరం గ్రామ శివారులో జరిగిన వాత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తేదీ 15.05.2026 న గణపవరం గ్రామ శివారులో భీక్యతండ రోడ్డుకు సమీపంలోని వ్యవసాయ భూమిలో ఒక యువకుడు హత్యకు గురై మృతదేహంగా లభ్యమైన విషయం తెలిసిందే. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, క్లూస్ టీమ్, ప్రత్యేక పోలీస్ బృందాలు శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సమాచారంతో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా గరుడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నిందితుడు A2 పగిల్ల ఉదయ్ కిరణ్, వయసు 20 సంవత్సరాలు, కొత్తగూడెం గ్రామంలో అతని ఇంటివద్దే ఈరోజు మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.
A2 నిందితుడు విదారణలో వెల్లడైన వివరాల ప్రకారం, మృతుడు బలుగురి గణేష్ అనే వ్యక్తి A1 నిందితుడు సోమేష్ ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోల విషయంలో నిందితుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి ఈ క్రమంలో హుజుర్నగర్ కు చెందిన A-1 బర్రెంకుల సోమేష్ తండ్రి సాంబయ్య, తన స్నేహితుడు A-2 ఉదయ్ కిరణ్ సహాయంతో పథకం ప్రకారం బలుగురి గణేష్ ను 14వ తేదీ రాత్రి సమయంలో గణపవరం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి పిలిపించాడు. అక్కడ ముందుగా సిద్ధం చేసుకున్న రాళ్లతో మృతుడి తలపై బలంగా దాడి చేసి, అనంతరం గొంతు బిగించి హత్య చేసినట్లు, తరువాత కత్తితో గొంతు కోసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుడు A-2 పగిల్ల ఉదయ్ కిరణ్ యొక్క ఒప్పుకోలు ప్రకారం ఇట్టికేసులో A-1 బర్రెంకుల సోమేష్ కు సహకరించిన అతని తల్లిదండ్రులు అయిన A-3 బర్రెంకుల జ్యోతి భర్త సాంబయ్య, A-4 బర్లింకుల సాంటయ్య తండ్రి సాయిలు లను కూడా హుజుర్నగర్ పట్టణంలో వారి ఇంట్లో ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగినది.
సంఘటన స్థలంలో రక్తపు మరకలు గల రాయి, ఖాళీ బాటిళ్లు, దుస్తులు, రక్తపు మట్టి తదితర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుండి నేరానికి ఉపయోగించిన కత్తి ని మరియు నాలుగు మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. ఈ కేసు ఛేదనలో బాగా పని చేసిన డి. రామ క్రిష్ణ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మునగాల,1/c కోదాడ రూరల్ సర్కల్, కోదాడ రూరల్ S1 Ch.గోపాల్ రెడ్డి మరియు సిబ్బందినీ సూర్యాపేట జిల్లా ఎస్సీ నర్సింహ ఐపీఎస్ అభినందించారు.
పరారీలో ఉన్న మరో నిందితుడు A-1 బరైంకుల సోమేప్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలపై ఎంతటి వారిపైననైనా పోలీసులు కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివాదాలు ఉంటే చట్టవుల్లంఘన చర్యలకు పాల్పడవద్దని చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించుకోవాలని డి.ఎస్.పి సూచించారు

