అధికారులు బాధ్యతాయుతంగా ప్రజల అర్జీలని సత్వరం పరిష్కరించి న్యాయం చేయాలి,

Sakshitha news

అధికారులు బాధ్యతాయుతంగా ప్రజల అర్జీలని సత్వరం పరిష్కరించి న్యాయం చేయాలి, అదే ప్రజాపాలనకు నిజమైన అర్థం : రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

      వనపర్తి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం : వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి

….

సాక్షిత వనపర్తి :
దళారీ వ్యవస్థ అనేది సమూలంగా లేకుండా చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల అర్జీలపై నిర్లక్ష్యం వద్దని, వేగంగా పరిష్కరించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా ఉన్నారు.

కార్యక్రమానికి ముందుగా తెలంగాణ గీతాన్ని ఆలపించి, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం వనపర్తి నియోజకవర్గం లో ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధి పొందుతున్న వారి వివరాలను తెలియజేసారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు తోడుగా అదనంగా మరిన్ని పథకాలను ప్రజలకు అందిస్తుందని తెలిపారు. విద్యా వైద్యంపై ప్రధాన దృష్టి సారించి, వీటికి ప్రధానంగా నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. ప్రజల అర్జీలను, దరఖాస్తులను వేగంగా పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు. దళారీ వ్యవస్థ అనేది సమూలంగా లేకుండా చేయాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల అర్జీలపై నిర్లక్ష్యం వద్దని, వాటిని వేగంగా పరిష్కరించాలని తెలిపారు. ఎటువంటి సమస్య లేకుండా భూభారతి కి సంబంధించి రైతుల నుంచి వచ్చే అర్జీలను శరవేగంగా పరిష్కరించాలని సూచించారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు పరిమితులకు లోబడి ఇండ్లను నిర్మించుకోవాలని, పరిమితికి మించి ఇండ్ల నిర్మాణం చేసుకోవడం ద్వారా తిరిగి అప్పులపాలయ్యే అవకాశం ఉంటుందని ఆ దిశగా అధికారులు పర్యవేక్షణ సాగించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై ప్రతి వ్యక్తికి సరైన సమాచారం అందాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో 65 ఏళ్లలో కేవలం రాష్ట్ర అప్పు రూ. 65 వేల కోట్లు ఉంటే, గత ప్రభుత్వం పది ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. యువత పక్కదారి పట్టకుండా, డ్రగ్స్ వైపు మల్లకుండా క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు.

ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిందని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేయడంలో బాగా పనిచేస్తున్న అధికారులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సంతకం మహిళా శక్తి పథకంపై చేశారని తెలిపారు. తద్వారా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు మహిళా శక్తి పథకం కోసం మహిళల ప్రయాణం కోసం ఖర్చుపెట్టిందన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటును గృహ జ్యోతి పథకం కింద ప్రభుత్వం పేదలకు అందించి పేదలకు కరెంటు కష్టాలు తీర్చిందని తెలిపారు. అదేవిధంగా గత పది సంవత్సరాలలో ఎన్నడూ ఒక రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని, రేవంతన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వనపర్తి జిల్లాలో 73 వేల కొత్త రేషన్ కార్డులను అందించామని తెలిపారు. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద గతంలో ఎకరాకు పదివేల రూపాయలు ఇస్తే, ఇప్పుడు దాన్ని ఎకరాకు 12 వేల రూపాయలకు పెంచామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో 15 బస్సులు కొనుగోలు చేయడం జరిగిందన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల ఏర్పాటు బాధ్యతలు మహిళలకు అప్పజెప్పడం జరిగిందన్నారు. వనపర్తి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క పూరి కూడా లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలని లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని, తద్వారా పేదల సొంతయింటి కల నెరవేరుస్తోందని తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు లక్ష ఇండ్ల గృహ నిర్మాణాలతో చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు.

వనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ పరిధిలో రహదారుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వనపర్తి లో 70 కోట్ల రూపాయలతో అందరికీ మంచినీటి సౌకర్యం అందించేందుకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. 47 కోట్ల రూపాయలతో వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మరియు జూనియర్ కళాశాలల భవన నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లా సమాఖ్య భవన నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సరికొత్త వనపర్తి జిల్లా హాస్పిటల్ నిర్మాణం కొరకు 203 కోట్ల రూపాయలతో పనులు శరవేగంగా ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. అదేవిధంగా యూనియన్ బ్యాంక్ సి ఎస్ ఆర్ నిధులతో వనపర్తి జిల్లా ఆసుపత్రిలో రెండున్నర కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు ఎల్పిజి కనెక్షన్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేసి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం విస్తృతంగా చర్యలు చేపట్టిందని, రైతు భరోసా, పంటల కొనుగోలు వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.

కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రుణ మాఫీ పథకం ద్వారా 61,687 మంది రైతులకు రూ.491 కోట్ల లబ్ది చేకూర్చడం జరిగింది అన్నారు. రైతు భరోసా కింద 1,83,839 మంది రైతులకు రూ. 140 కోట్ల పెట్టుబడి సాయం అందించమన్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 50,585 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించి వారి ఖాతాల్లో నగదు వేసినట్లు తెలిపారు. వనపర్తి జిల్లాలో 1,82,262 రేషన్ కార్డులు ఉండగా వాటిలో 73,214 కార్డులు ప్రజా ప్రభుత్వం లో కొత్తగా జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 84,830 లబ్ధిదారులకు గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించి కరెంటు బిల్లుల భారం తగ్గించిందాన్నారు. అదేవిధంగా జిల్లాలో మొత్తం 6,094 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి సొంతం ఇంటి కల నెరవేర్చమన్నారు.

               జిల్లాలో మొత్తం 8,258 స్వయం సహాయక సంఘాలకు రూ.28 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మహిళలకు 97,076 ఏక రూప చీరలు, 70,516 మందికి చేయూత పెన్షన్ లు అందించడం జరిగిందన్నారు. విద్యాశాఖ పై ప్రత్యేక చొరవ తీసుకున్న ప్రభుత్వం గతేడాదితో పోలిస్తే పదో తరగతి ఫలితాల్లో మెరుగైన స్థానాన్ని సాధించిందని తెలిపారు. 97% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 19వ స్థానాన్ని సాధించిందని తెలిపారు.

ఈ సందర్భంగా బాల భరోసా కార్యక్రమం కింద జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ల సంయుక్త ఆధ్వర్యంలో 16 మంది చిన్నారులకు వినికిడి పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం వనపర్తి, చిన్నంబావి మండలాలకు చెందిన మహిళా సమాఖ్యలకు ఇందిరా మహిళా …

Scroll to Top