అరుంధతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ దుండిగల్ గ్రామానికి చెందిన కంజర్ల అశోక్ (ఇటీవల రోడ్డు ప్రమాదంతో గాయపడగా) మరియు గొప్పరాజు నారాయణ(జాండిస్ వ్యాధితో) బాధపడుతూ నగరంలోని అరుంధతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా సంబంధిత వైద్యులను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన మరియు నాణ్యతమైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో తాను వారికి అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ వారు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు జక్కుల శ్రీనివాస్ యాదవ్, బండారి మహేందర్ యాదవ్, సుధాకర్ రెడ్డి, భరత్ కుమార్, పాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, నాయకులు ఈ శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, నర్సింగ్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్, మరియు కుటుంబ సభ్యులు వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

