సచివాలయానికి వాటర్ రిఫ్రిజిరేటర్ సొంత నిధులతో ఇచ్చిన కొల్లా బ్రదర్స్
సాక్షిత : ప్రజలకు ప్రజలకి ఇబ్బందులు కలక్కుండా చూడడమే మా టిడిపి ప్రభుత్వ ధ్యేయం.
నెల్లూరు జిల్లాఇనమడుగు గ్రామంలోని పంచాయతీకి సచివాలయానికి వాటర్ రిఫ్రిజిరేటర్ లను కోవూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇనమడుగు గ్రామ ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి,వారి సొంత నిధులతో ఇనమడుగు పంచాయితీ స్పెషల్ ఆఫీసర్ మరియు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో వాటర్ రిఫ్రిజిరేటర్ లను ను అందించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఇనమడుగు గ్రామంలో కొల్లారెడ్డి బ్రదర్స్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందు ఉంటారని వివిధ రకాల పనులపై, సమస్యలపై, ప్రజలు సచివాలయానికి వస్తుంటారు ఈ ఎండలను దృష్టిలో పెట్టుకొని వారి దాహార్తిని తీర్చుకునేందుకు ఇబ్బంది పడకూడదని పంచాయతీకి మరియు సచివాలయానికి ఈ రిఫ్రిజిరేటర్ ని అందించడం జరిగింది అలాగే ఈ మధ్యకాలంలో నిరుపయోగంగా ఉన్న బస్సు షెల్టర్ లను మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైనా కాలం చెల్లినప్పుడు వారికి మట్టి ఖర్చులకు ఆర్థిక సహాయం అందించడం ఎన్నో సేవా కార్యక్రమాల్లో కొల్లారెడ్డి బ్రదర్స్ ముందుంటారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట ఇనమడుగు తెలుగుదేశం నాయకులు చింతలపూడి పెంచలయ్య, మాజీ ఎంపీటీసీ వెలగపూడిశ్రీనివాసులు,కోవూరు మండల కార్యనిర్వాహక కార్యదర్శి షేక్. సుభాన్, తదితరులు పాల్గొనడం జరిగింది.

