ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన చైర్ పర్సన్ మోర్ల సుప్రజ.
సాక్షిత : నెల్లూరు జిల్లా గ్రీవెన్స్ డే సందర్భంగా బుచ్చిరెడ్డిపాళెంమున్సిపాలిటీ కార్యాలయంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి ప్రజల నుంచి పలు ఫిర్యాదుల స్వీకరించారు. వివిధ సమస్యలతో ప్రజలు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి చైర్ పర్సన్ కి ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన దృష్టికి సమస్య వచ్చిన వెంటనే అధికారులను పురమాయించి వీలైనంత త్వరగా పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానన్నారు. గ్రీవెన్స్ డే ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పట్టణంలో ఏ సమస్య వున్నా తన దృష్టికి తేవాలని తన వల్ల కాని పక్షంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ ఇనమల చిన బాబు, వైస్ చైర్మన్ ఎరుటపల్లి వెంకట శివ కుమార్ రెడ్డి, కౌన్సిలర్ కత్తి శ్రీదేవి ,పాల్గొన్నారు….

