టీటీడీలో ప్రమోషన్లు కల్పించాలి

Sakshitha news

టీటీడీలో ప్రమోషన్లు కల్పించాలి

** ఈఓ రవిచంద్రకు ఎస్.డబ్ల్యూ.యూ.ఎఫ్ విన్నపం
…..

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీలో గత కొంతకాలంగా ప్రమోషన్లు పెండింగ్ లో ఉడడంతో అర్హత ఉండి కూడా పదోన్నతులు పొందకుండానే పదవీ విరమణ చేస్తున్న కారణంగా త్వరగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్ఓఆర్) సమస్య పరిష్కరించి అన్నివిభాగాల్లో ప్రమోషన్లు కల్పించాలని టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ (సీఐటీయూ అనుబంధం) నాయకులు విన్నవించారు. అనేక టీటీడీ ఉద్యోగుల సమస్యలపై యునైటెడ్ ఫ్రంట్ నాయకులు గోల్కొండ వెంకటేశం, కాటా గుణశేఖర్,
నైనార్ పద్మనాభం, పి.రాము, పట్నం దయాకర్, ఎస్.వెంకటముని రాజు, కోనేటి బాలాజీ, కె.శ్రీనివాసులు, శివయ్య, బి.హనుమంత రెడ్డి, మునికిరణ్ కుమార్, కె.ధనంజయులు, మధుసూదన్ రావు, రాజా రాహుల్ తదితరులు ఈఓ ముద్దాడ రవిచంద్రను కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. టీటీడీలోని ఇంజనీరింగ్, క్యాంటీన్, ట్రాన్స్‌పోర్ట్, టెక్నికల్, వాటర్ అండ్ ఎలక్ట్రికల్ ,గార్డెన్ విభాగాలలో ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని కోరారు.

ఇదే సమయంలో టీటీడీ ఉద్యోగుల హెల్త్ స్కిం సమస్యను పరిష్కరించినందుకు ఈఓకు ఉద్యోగ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మిగిలిన సమస్యలపై కూడా చర్చించిన యునైటెడ్ ఫ్రంట్ నాయకులు వీలైనంత వరకు త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు ఎదురవుతున్న ఇంటి స్థలాల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి. కారుణ్య నియామకాలను త్వరగా భర్తీ చేయాలి. ఓఎస్ఓ నుంచి అసిస్టెంట్/షారాబ్, లుగా అసిస్టెంట్/షారాబ్ లనుండి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులను త్వరగా కల్పించాలి. టీటీడీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ఉద్యోగులపై పడుతున్న పని భారం తగ్గించాలని కోరగా త్వరలో చర్యలు తీసుకుంటామని ఈఓ తెలిపారని అన్నారు.
1060 సర్వీస్ రూల్స్‌ను ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా సవరించాలి.
ఆఫీస్ సబార్డినేట్ల కొరత కారణంగా పని భారం అధికంగా ఉన్నందున వెంటనే ఆఫీస్ సబార్డినేట్ల నియామకాలు చేపట్టాలి. అప్పటి వరకు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులకు ఆఫీస్ సబార్డినేట్లుగా కన్వర్షన్ కల్పించాలి. గత రెండు పీఆర్సీల నుండి పెంచని పిలిగ్రిమ్స్ అలవెన్స్ ప్రస్తుతం ఉన్న రూ.2500ను రూ.5000లకు పెంచాలి.


హిల్ అలవెన్స్, నైట్ డ్యూటీ అలవెన్స్, పరకామణి అలవెన్స్ తో పాటు రిస్క్ అలవెన్స్‌లను పెంచాలి. టీటీడీలో పనిచేస్తూ అర్హత కలిగిన ఉద్యోగులకు ఆర్బీటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి.
ఫారెస్టు ఉద్యోగులకు మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలి.
గార్డెన్ విభాగంలో పనిచేస్తున్న సొసైటీ ఉద్యోగులు సెమి-స్కిల్డ్ పనులు చేస్తున్నప్పటికీ అన్‌స్కిల్డ్ జీతాలు ఇస్తున్నందున, వారికి సెమి-స్కిల్డ్ ప్రాతిపదికన జీతాలు చెల్లించాలి. అన్ని సమస్యలపై సానుకూలంగా స్పందించి, త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసినందుకు టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్రకు టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు అందరు ఉద్యోగుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్రంట్ నాయకులు గోల్కొండ వెంకటేశం, నైనార్ పద్మనాభం, కాటా గుణశేఖర్, పి.రాము, పట్నం దయాకర్, ఎస్.వెంకటముని రాజు, కోనేటి బాలాజీ, కె. శ్రీనివాసులు, శివయ్య, బి. హనుమంత రెడ్డి, మునికిరణ్ కుమార్, కె. ధనంజయులు, మధుసూదన్ రావు, రాజా రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top