లైబ్రరీ షాపింగ్ కాంప్లెక్స్లో కిరాయి ఆవకతోకలపై విచారణ జరిపించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన……….. టి జె సి ఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా
…

సాక్షిత వనపర్తి :
వనపర్తి జిల్లా కేంద్రంలోని శంకర్ గంజ్ లైబ్రరీ కి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ అలాగే కొత్తకోట లైబ్రరీ షాపింగ్ కాంప్లెక్స్ ల కిరాయి టెండర్ల విషయంలో అవకతకాలు జరుగుతున్నాయని సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని టీ జె సి ఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా వనపర్తి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది.
జిల్లా శంకర్ గంజ్ లైబ్రరీ కాంప్లెక్స్ లో రెండు షాపులు అద్దె కు అలాగే కొత్తకోటలోని లైబ్రరీ సంబంధించిన మూడు షాపులను ఉద్దెకిస్తూ ఉన్నారని అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారంప్రకారం ప్రతి ఐదు ఏళ్లకోసారి టెండర్లు పిలవాల్సి ఉండగా గత 25 ఏళ్లుగా టెండర్లు పిలవకుండా పాతవారికి అతి తక్కువ అద్దెకు కొనసాగిస్తూ లైబ్రరీ అధికారులు వెంకటయ్య తేజలు షాపు అదేదారులతో కుమ్మక్కై లైబ్రరీ ఆదాయానికి గండి కొడుతున్నారని అలాగే కొత్తకోటలోని మూడు షాపులు వీటి టెండర్లు గడుపు రెండేళ్లు క్రితమే గడువు పూర్తయిందని కొత్త టెండర్లకు పిలవకుండా పాత కిరాయిదారులు ఇస్తున్న అద్దె డబ్బులను అధికారులు వ్యక్తిగతంగా వాడుకుంటున్నారని లైబ్రరీ ఖాతాలో జమ చేయట్లేదని ఈ విషయంపై పూర్తి విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోని లైబ్రరీల ఆదాయాన్ని కాపాడాలని కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నట్లు ఖాదర్ పాషా పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
