పి.4 ద్వారా నిర్మించిన కూరగాయల మార్కెట్ సి.యం.చంద్రబాబుకు అంకితం..
సాక్షిత ::బుచ్చిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న వారు చరిత్రహీనులుగా మిగులుతారు..
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ P4 విధానమని P4 విధానం ద్వారా బుచ్చిలో నిర్మించిన కూరగాయల మార్కెట్ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అంకితం ఇస్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిఅన్నారు. బుచ్చి పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బుచ్చిరెడ్డి పాళెం ప్రజల ఎన్నో ఏళ్ల నాటికల P4 విధానం ద్వారా నెరవేరింది అన్నారు. 62 రూముల మార్కెట్ సముదాయంతో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. మార్కెట్లో పాత దుకాణదారులకు లాటరీ విధానంలో, నూతన దుకాణదారులకు వేలం పాటల ద్వారా దుకాణాలు కేటాయించడం జరుగుతుందన్నారు. బుచ్చి పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి త్వరలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా అభ్యున్నతికి కృషి చేస్తారన్నారు.డ్వాక్రా మహిళలకు మెప్మా ద్వారా కోటి 60 లక్షల రుణాలు అందించడం జరిగిందన్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ కోసం యన్.డి.ఏ నేతలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేశారని, కానీ మహిళల మీద గౌరవం లేని కొంతమంది ఈ బిల్లును అడ్డుకున్నారన్నారు. ఈ బిల్లును కావాలనిఅడ్డుకున్న వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు అన్నారు. మార్కెట్ సముదాయంలో విద్యుత్తు ఫ్యాన్ల సౌకర్యం కొరకు సోలార్ సిస్టం అందుబాటులోకి తెస్తామన్నారు.ఈ ప్రారంభానికి ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ రావలసి ఉంది అని కానీ వారికి వేరే కార్యక్రమం ఉండడంతోరాలేకపోయారన్నారు.త్వరలో అధికారికంగా ఎంపీ మంత్రి తో కలిసి మార్కెట్‌ను పున: ప్రారంభిస్తామని వారు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో బుచ్చి చైర్పర్సన్ మోర్ల సుప్రజ,మోర్ల మురళి, పట్టణ అధ్యక్షులు గుప్తా శ్రీనివాసరావు,బుచ్చి మండల అధ్యక్షులు బెజవాడ జగదీష్, కె.వి శేషయ్య, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

