ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయం

Sakshitha news

ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయం

సాక్షిత : అన్నా క్యాంటీన్లో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి 76 లక్షల విరాళం..

నాయకులు, కార్యకర్తలు, అన్నా క్యాంటీన్ల విరాళానికి భాగస్వాములు కావాలి..

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి..

ఆకలి లేని సమాజమే మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య ఉద్దేశమని అలాగే నందమూరి తారక రామారావు కళ అన్నా క్యాంటీన్ల ఏర్పాటు అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.కోవూరు అన్న క్యాంటీన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పేదలకు అన్నం వితరణ చేసి, కేకును కత్తిరించి ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్ల అభివృద్ధికి 76 లక్షలు విరాళం అందజేశారని తెలిపారు.నాయకులు కార్యకర్తలు నా వద్దకు తెచ్చే శాలువాలు బొకేలు వంటివి నిలిపివేయాలని సాయం చేయాలనుకుంటే అన్నా క్యాంటీన్లకు సాయం చేయాలనివారు నాయకులకు కార్యకర్తలకు సూచించారు.

అలాగే ప్రజలు కూడా ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే దానం చేయాలనుకుంటే పదిమంది కడుపు నింపే అన్నా క్యాంటీన్లకు సాయం అందించాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లను నిర్వీర్యం చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అన్నా క్యాంటీన్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఈ అన్న క్యాంటీన్ల ద్వారా రెండు లక్షల 70 వేల మంది పైగా రోజు 5 రూపాయలకే భోజనంఅందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి,పెన్నా డెల్టా చైర్మన్ జెట్టిరాజగోపాల్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, జొన్నవాడ దేవస్థానం చైర్మన్ తిరువూరు అశోక్ రెడ్డి, జెట్టి మదన్ రెడ్డి, కొల్లారెడ్డి సునీల్ రెడ్డి,సాయి తేజ రెడ్డి, దారపనేని శ్రీనివాస్ నాయుడు, దారా విజయ్ బాబు,ముసలి సుధాకర్, ఏకశిరి వెంకటరమణమ్మ, పబ్బారెడ్డి మల్లికార్జున్ రెడ్డి, సాయి జయంత్ రెడ్డి, పాలూరు బాలకృష్ణ, షేక్. జమీర్, షేక్. జహంగీర్, బిజెపి మండల అధ్యక్షులు పోలిశెట్టిసుబ్బారావు,మరియు కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Scroll to Top