సూరారం లోని అంబేద్కర్ భవన్‌లో ఘనంగా కార్యక్రమం

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సూరారం లోని అంబేద్కర్ భవన్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ సేవలు దేశానికి అమూల్యమని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని, దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి పాత్ర ముఖ్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దళిత సేన నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Scroll to Top