కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం పరిధిలోని ఉషోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెల్లీ వేంద్రాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించడం ఎంతో సేవాభావంతో కూడుకున్న కార్యక్రమమని, ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని ఆకాంక్షించారు. అలాగే సమాజంలో సేవా భావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోల సంజీవరెడ్డి,మైసిగారి శ్రీనివాస్, ట్రస్ట్ అధ్యక్షులు డేగల సతీష్ బాబు,రంజిత్, కుంపట్ల శ్రీనివాస్,సురేంద్రనాథ్ రెడ్డి,నరసింహ రెడ్డి, డేవిడ్ రాజు,రమేష్, నారాయణ, సత్యనారాయణ,వికాస్, గఫ్ఫార్, రహీం, అసిఫ్, రెహానా షైక్ తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY