కడు రమణీయంగా ఊంజల్ సేవ

Sakshitha news

కడు రమణీయంగా ఊంజల్ సేవ

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: స్థానిక పెద్దకాపు వీధిలో వెలసిన శ్రీరామ భజన మందిరంలో నవమి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సీతారాములకు ఊంజల్ సేవ కడు రమణీయంగా నిర్వహించారు. స్థానికులు ఈ ఊంజల్ సేవలో పాల్గొని సీతారాములను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. పేట మోహన్ రామిరెడ్డి, పార్వతి దంపతులు వారి కుటుంబ సభ్యులు మూడవ రోజు ఊంజల సేవలో ఉభయదారులుగా వ్యవహరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, కాగితాల చంద్ర, తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విజయమ్మ, కేఎన్ రాజా, లక్ష్మమ్మ, నారాయణ రెడ్డి, తదితర భక్తులు పాల్గొన్నారు.

Scroll to Top