రాములోరి కళ్యాణం వైభవంగా చేద్దాం
సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పణ
** ఏర్పాట్లు పరిశీలనలో రాష్ట్ర మంత్రి సవిత
….
సాక్షిత ప్రతినిధి – ఒంటిమిట్ట / తిరుపతి:
టీటీడీకి చెందిన ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి వారి కళ్యాణోత్సవాన్ని బుధవారం (రేపు) అంగరంగ వైభవంగా… విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత పిలుపునిచ్చారు.
ఒంటిమిట్టలోని టీటీడీ సమావేశ మందిరంలో మధ్యాహ్నం ఆమె జిల్లా రెవిన్యూ, పోలీస్, టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ఏప్రిల్ 1న (రేపు) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సమర్పించే పట్టు వస్త్రాల కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ ఏర్పాట్ల వివరాలను మంత్రికి వివరించారు. మంత్రి మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ, జిల్లా పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
