మన ప్రాంతంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు బంగారు కుటుంబంగా తీర్చిదిద్దుతా..ఎమ్మెల్యే అమిలినేని

Sakshitha news

మన ప్రాంతంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు బంగారు కుటుంబంగా తీర్చిదిద్దుతా..ఎమ్మెల్యే అమిలినేని

ప్రజలకు సాయం చేసే వారికి మరికొందరు కూడా తోడవుతారు..

అధికారుల మధ్య కూర్చునే అవకాశం ప్రజలు నాకు ఇచ్చారు ఇది నా అదృష్టం

ప్రజలకు మంచి చేయాలనే చంద్రబాబు నాయుడు విజన్ 2047తో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఆలోచించారు..

పీ4 విధానం ద్వారా పేద కుటుంబాలను ఆర్థికంగా ముందుకు తీసుకురావడమే ముఖ్యఉద్దేశ్యం

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో గత 15 సంవత్సరాల నుంచి పీ4 విధానం ద్వారా ఎంతో మందికి భవిష్యత్తుకు బాటలు వేసామని, ఇప్పుడు కూడా మన కళ్యాణదుర్గం ప్రాంతంలోని తిమ్మసముద్రం వద్ద ఉన్న APIIC భూముల్లో ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ముందుకు వస్తే కుటీర పరిశ్రమలు అయిన పేపర్ ప్లేట్స్, గ్లాసులు, చెక్క స్పూన్లు, ప్లాస్టిక్ రహిత బ్యాగులు తాయరీ చేసే చిన్న పరిశ్రమలు ఏర్పాటుకు సహకరిస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు..నేడు మార్గదర్శి బంగారు కుటుంబం ఏడాది పూర్తి అయిన సందర్బంగా అధికారులు, పీ4 విధానంలో మార్గదర్శకులుగా నిలిచిన వారికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు , ఆర్డీఓ ప్రశంశా పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా పేద వారు ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో పీ4 విధానం ద్వారా వారికి మార్గనిర్దేశకులుగా నిలిచి అవసరమైన వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి వారి కుటుంబం బంగారు కుటుంబంగా తీర్చిదిద్దెందుకు తొడ్పడుతుందని, మన ప్రాంతంలో కూడా అలాంటి వారు ఎవరైనా సరే ఇతర కంపెనీల వారితో మాట్లాడి సీఎస్సార్ ఫండ్ ద్వారా వారికి తోడ్పాటు అందిస్థానని, రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలకు మున్ముందు మంచి జరగాలని, వారి కుటుంబాలు కూడా ఆర్ధిక అసమానతలు లేని విధంగా ఉండేందుకు ముందు చూపుతోనే భవిష్యత్తు బాగు కోసం విజన్ 2047 తీసుకువచ్చారన్నారు.చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మన ప్రాంతంలోని పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు మంచి చేయాలనే లక్ష్యంతో అమెరికాలో ఉన్న మిత్రులతో మాట్లాడి సైకిల్స్ అందించాలని చూస్తున్నామని రాబోయే నాలుగు లేదా ఐదు నెలల్లో అందిస్తామని అన్నారు..ప్రజలకు మంచి చేయాలనే మనసు ఉన్న వారికి తప్పకుండా మరికొందరు కూడా తోడుగా నిలుస్తారని, గత ఐదేళ్లు అటు నాయకులు గాని, అధికారులు గాని ప్రజల గురించి ఆలోచించి ఇలాంటి ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని, కేవలం దోచుకోవడం కోసం పనిచేశారని అన్నారు..

Scroll to Top