తెలుగుదేశం పార్టీ పుట్టుక ఈ భారత దేశ రాజకీయాలను మలుపు తిప్పిన చరిత్ర

Sakshitha news

తెలుగుదేశం పార్టీ పుట్టుక ఈ భారత దేశ రాజకీయాలను మలుపు తిప్పిన చరిత్ర
….

సాక్షిత :+పడుగుపాడులో ఘనంగా తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి,పెన్నాడెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, పడుగుపాడు ఇంచార్జ్ జెట్టి మదన్ రెడ్డి,తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ దారపనేని శ్రీనివాస్ నాయుడు,ముందుగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి జయహో ఎన్టీఆర్ అని నినాదాలు చేశారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీ పుట్టుక ఈ భారత దేశ రాజకీయాలను మలుపు తిప్పిన చరిత్ర నందమూరి తారక రామారావు పార్టీని 1982లో మార్చి 29స్థాపించి కేవలం 9 నెలల్లోనే గెలుపొందిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు కే దక్కుతుంది అని అన్నారు.

అలాగే రాజకీయాలు కొత్తయినా నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన అనేక పథకాలు దేశమంతా అమలవుతున్నాయి మహిళలకు ఆస్తిలో సమానం హక్కు, మహిళలకు ,బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, పేదలకు పక్కా గృహాలు, రేషన్ కార్డులు, వృద్ధులకు, వితంతువులకు, పెన్షన్ ఇలాగా అనేక పథకాలు ఆనాడే ఎన్టీ రామారావు తీసుకుని వచ్చారని తెలిపారు.

అలాగే స్థానిక నాయకులు ఏర్పాటుచేసిన అల్పాహార విందులో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు బత్తుల రమేష్, పాలూరు బాలకృష్ణ, షేక్ జమీర్, యస్.డి దత్తగిరి, షేక్. ఫిరోజ్, లోక్ సాయి, ఏకసిరి సుగుణమ్మ, స్థానిక నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Scroll to Top