కార్యకర్తలు టిడిపి పార్టీకి అధినేతలు

Sakshitha news

కార్యకర్తలు టిడిపి పార్టీకి అధినేతలు.
….

సాక్షిత : ఇంత భారీ మెజార్టీతో గెలిచాను అంటే అది కార్యకర్తలు కష్టమే..

టిడిపిలోనే కార్యకర్తలకు గుర్తింపు..

పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

నెల్లూరు జిల్లా టిడిపి పార్టీ పేదల పార్టీ కార్యకర్తలే పార్టీకి అధినేతలని కోవూరుఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఆదివారం బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో టిడిపి ఆవిర్భావ వేడుకలలో వారుపాల్గొన్నారు.

ఈ సందర్భంగావారు మాట్లాడుతూ.. కార్యకర్తల కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారుఅన్నారు. కార్యకర్తల కష్టం వల్లే రాష్ట్రంలో టిడిపి “164 సీట్లుతో” గెలిచిందని కోవూరు నియోజకవర్గంలో కొత్త మహిళా అభ్యర్థిని ప్రకటిస్తే అత్యంత భారీ మెజారిటీతో మీరు గెలిపించారు అంటే అది కార్యకర్తల కష్టమేఅని1 అన్నారు.

నాయకులు కార్యకర్తలు అందరూ సమన్వయంతో పని చేయాలని ఎవరికీ ఏ కష్టం,నష్టం వచ్చినా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. టిడిపి క్రమశిక్షణకు మారుపేరని నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణగా ఉండాలని సూచించారు.

మనందరికీ ఒకే కుటుంబం అని అది తెలుగుదేశం కుటుంబం మాత్రమే అన్నారు. రామన్న రోజుల్లో అందరం ఇలాగే కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బుచ్చి చైర్పర్సన్ మోర్ల సుప్రజ, కోడూరు కమలాకర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు గుప్తా శ్రీనివాసరావు,రూరల్ అధ్యక్షులు బెజవాడ జగదీష్, కె.వి. శేషయ్య, నియోజకవర్గ నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top