శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం లో భక్తులకు” మైనార్టీల ” మజ్జిగ పంపిణీ….
….
సాక్షిత పెద్దపల్లి// గోదావరిఖని: శ్రీ కోదండ రామాలయం లో జరిగిన శ్రీసీతారాముల కళ్యాణం మహోత్సవం నకు వచ్చినటువంటి భక్తులకు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం నియోజకవర్గ మైనారిటీ సెల్ ఇంచార్జ్ అబ్దుల్ కపూర్, పెద్దపెల్లి జిల్లా మైనార్టీ కార్యదర్శి తాజుద్దీన్ బాబా, మహమ్మద్, అడ్వకేట్ సీనియర్ ఖజానాజిముద్దీన్, సీనియర్ నాయకులు, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.డి మోబిన్ ఆధ్వర్యంలో భక్తులకు చల్లటి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మైనార్టీలో మాట్లాడుతూ భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని అన్ని మతాలు కులాలు కలిసి ఉంటేనే ప్రపంచ శాంతి అని అందరు సుఖసంతోషాలతో ఉండాలని, సోదర భావంతో మెలగాలని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, ప్రతి మతం యొక్క సారాంశం అని దీనినే మన రామగుండంలో మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అమలు చేస్తూ అన్ని మతాల వారికి సమానంగా అవకాశాలను కల్పిస్తూ, అందరి అభివృద్ధి కోసం పని చేస్తూ రామగుండం నియోజకవర్గం ముందు భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా అందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షఫీ ఫుర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
