కామ్రేడ్ రామాంజనేయులు మరణం బాధాకరం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

Sakshitha news

కామ్రేడ్ రామాంజనేయులు మరణం బాధాకరం.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

జగతగిరిగుట్ట శాఖ సిపిఐ నాయకులు కామ్రేడ్ రామాంజనేయులు గుండెపోటుతో మరణించడం వల్ల నేడు వారి మృతదేహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి సానుభూతి ని ప్రకటించడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రామాంజనేయులు సిపిఐ పార్టీ ఇచ్చే అన్ని పిలుపులో స్వచ్చందంగా పాల్గొని జయప్రదం కొరకు పనిచేసాడని,దుర్గయ్య మరణం రోజున చాలా బాధపడి ఇలాంటివి భవిష్యత్తులో జరుగోద్దని అభిప్రాయం వ్యక్తం చేసిన కొద్దిరోజుల్లోనే తమ నుండి దూరం కావడం బాధాకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి స్వామి, సహాయ కార్యదర్శులు రాములు,హరినాథ్ రావ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్,ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు,సిపిఐ నాయకులు బక్కరి మల్లేష్, ఇమామ్,నర్సింహా,చారి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top