పోలీస్ గ్రీవెన్స్ కు 94 ఫిర్యాదులు
** స్వయంగా వినతులు స్వీకరించిన జిల్లా ఎస్పీ
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పి.జి.ఆర్.ఎస్ (గ్రీవెన్స్) కార్యక్రమంలో మొత్తం 94 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్వయంగా వినతులను తీసుకున్నారు. సమస్యలపై వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఫిర్యాదుదారునితో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సానుకూలంగా స్పందించారు. అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు వెంటనే పంపించి, వాటిని ప్రాధాన్యతగా తీసుకుని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపే దిశగా అవసరమైన మార్గదర్శకాలు కూడా అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, రవిమనోహర చారి, శ్రీనివాస్, ట్రాఫిక్ డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY