సాయి మందిరంలో పూజలు అన్నదానం….
సర్పంచులకు ఘన సన్మానం..
సాక్షిత ప్రతినిధి : కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామం సాయి మందిరంలో సర్పంచులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఘనంగా సాగింది.ఈ కార్యక్రమానికి ముందు సాయి మందిరంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.చిమిర్యాల గ్రామ సర్పంచ్ కొత్త గురవయ్య, దొరకుంట గ్రామ సర్పంచ్ పాలకి సురేష్, నల్లబండగూడెం గ్రామ సర్పంచ్ అల్సగాని భవాని శరబయ్య, రెడ్లకుంట గ్రామ సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు, ఉప సర్పంచ్ మల్లెల ప్రసాద్, మంగళ్ తండా గ్రామ సర్పంచ్ ధరావత్ బాబ్జీ నాయక్‌లతో పాటు రిటైర్డ్ డీపీఓ వెంకటేశ్వర్లు ను దేవాలయ కమిటీ సభ్యులు, నాయకులతో శాలువాలతో సత్కరించారు.
అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన సంవత్సరం సందర్భంగా సాయి మందిరానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదం అందించడం ద్వారా సేవా కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం కల్పించారు.
ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు మాట్లాడుతూ, సాయి మందిరంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి తో పాటు ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు . ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు, గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు గంగవరపు లక్ష్మణరావు, రవి, ధరావత్ నాగేశ్వరరావు, శేషు, ఆలయ అర్చకులు సాయి శర్మతో పాటు దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
