CPI మేడ్చల్ జిల్లా సమితి ప్రచురణార్థం. 15/10/2025
42శాతం బీ.సీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలి
ఈనెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలి
సీపీఐ, బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన
42శాతం బీ.సీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని, ఈనెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలని పిలిపునిస్తూ మేడ్చల్ జిల్లా సమితి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మరియు బీ.సీ.హక్కుల సాధన సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈసీఐఎల్ లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా హాజరై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఎస్ బోస్,సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సకుటుంబ సర్వేను నిర్వహించి ఆ గణాంకాల ఆధారంగా బీ.సీ.రిజర్వేషన్లు ఏర్పాటు చేయాల్సిందిగా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలలో నూతన రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలలో సభ్యులకు కేటాయింపులు జరుగుతాయనే భావన ఉన్నా, ప్రజలకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తెలంగాణ రాష్ట్రంలోని బీసీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేశాయన్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టి 9 వ షెడ్యూల్ లో చేర్చవచ్చని కానీ బీజేపీ కి బీసీ బిల్లు పై ఇష్టం లేక రాష్ట్ర ప్రభుత్వల పై నింద మోపుతున్నారని రిజర్వేషన్ పై నిర్ణయం తీసుకోకపోతే గట్టి ఉద్యమం మొదలైనందని ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్త రెండు కోట్ల మంది బీ.సీలు, అణగారిన ప్రజా సంఘాలు పూర్తి మద్దతు ఇవ్వాలని, బందును సంపూర్ణ విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివారల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.జి.సాయిలు గౌడ్. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దామోదర్ రెడ్డి,స్వామి,సిపిఐ కార్యవర్గ సభ్యులు శంకర్,లక్ష్మి, కిషన్, ధర్మేంద్ర, హరినాథ్, శ్రీనివాస్,సత్యప్రసాద్,బీ.సీ హక్కుల సాధన సమితి మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి జి.కృష్ణ, అధ్యక్షులు ఏ.బాపిరాజు పాల్గొన్నారు.
దేశ జనాభాలో మేమెంత మాకంత అనే నినాదంతో సాగిన ఈ ర్యాలీలో బీసీ హక్కుల సాధన సమితి అధ్యక్షులు ఏ బాపిరాజు గౌరవాధ్యక్షులు సిహెచ్ దశరథ్ కార్యదర్శి జి.కృష్ణ సిపిఐ జిల్లా సి.పి.ఐ సభ్యులు
బి.శ్రీనివాస్, కె.ప్రమీల, k.మహాలక్ష్మి సి.హెచ్ B.మాధవి
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(AIKS) రాష్ట్ర కోశాధికారి డి.జి.నరేందర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి నిమ్మల నరసింహ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
