24వ గురు పౌర్ణమి సప్తాహ మహోత్సవం
శ్రీషిరిడి సాయిబాబా మందిరంలో 5వేల మందికి పైగా అన్న ప్రసరణ
ఉభయకర్తలుగామన్నె మాల రవీంద్రారెడ్డి, జ్యోతిర్మయి దంపతులు
కోవూరు మండలం హైవే బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న శ్రీషిరిడి సాయిబాబా మందిరం 24వ గురు పౌర్ణమి సప్తాహ మహోత్సవం పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు జగదీశ్ స్వామి సమక్షంలో ఆ సాయినాధునికి పంచామృత అభిషేకం, సాయి సహస్ర నామర్చన, సంధ్య హారతి, పూలంగి సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రాలతో జరిగాయి. వేలాది సంఖ్యలో ఆ సాయినాధుని దర్శించుకుని భక్తులు పుణ్యహితులయ్యారు చూడడానికి మా రెండు కళ్ళు చాలడం లేదని తెలియజేశారు. దేవాలయ ప్రాంగణం మంతా సాయినాధుని నామస్మరణతో మారుమోగింది.
అనంతరం వారు మాట్లాడుతూ ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు సాయినాధుని కృప తో చాలా బాగా జరిగాయని అన్నప్రసరణ 5వేల మంది పైగా భక్తుల రావడం జరిగిందని. సూర్యోదయం మొదలుకొని వేలాదిగా భక్తులు రావడం ఆ సాయినాధుని దర్శించుకోవడం జరిగింది. ప్రజలు ఆయురారోగ్యాలతో ఆ సాయినాధుని కృపతో బాగుండాలని తెలియజేశారు.అలాగే దేవాలయ వ్వ్యవస్థాపకరాలు పచ్చిపాల సుజాతమ్మ, ధర్మకర్త పచ్చిపాల గోపాల్ రెడ్డి, పచ్చిపాల మల్లికార్జున రెడ్డి,ఈ దేవస్థానానికి వారి సహాయ సహకారాలు అందిస్తూనేఉన్నారు. ఈ కార్యక్రమంలో శివుని నరసింహులు రెడ్డి అత్తిపల్లి అనూప్ రెడ్డి, ఆంజనేయులు, కవరగిరి ప్రసాద్, వేల సంఖ్యలో భక్తులు, పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
