1000 రోజుల కాంగ్రెస్ పాలనకు ప్రజల హర్షం – ఘనంగా బైక్ ర్యాలీ ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: కాంగ్రెస్ ప్రజా పాలనకు 1000 రోజులు పూర్తయిన సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
283వ డివిజన్ D-Mart నుంచి ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి వైస్ ప్రెసిడెంట్ బి. శివకుమార్, 283వ డివిజన్ ప్రెసిడెంట్ కనకరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ జైరామ్, 281వ డివిజన్ అధ్యక్షుడు జలీల్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిమి రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ తైలం శ్రీనివాస్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కార్యం ప్రకాష్, మైనారిటీ అధ్యక్షుడు అజర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మురళీ, భాస్కర్, వెంకటేష్, మహిళా అధ్యక్షురాలు మాధవి రాణి, చిన్నమ్మ, నీల గుప్త, లక్ష్మీ రెడ్డి, లక్ష్మీ, భాగ్య తదితరులు** పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేశారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST