శ్రీగంగాదేవి అమ్మవారి జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు

Sakshitha news

శ్రీగంగాదేవి అమ్మవారి జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం ;
భీమవరం రెస్ట్ హౌస్ రోడ్డులోని శ్రీగంగాదేవి అమ్మవారి దేవస్థానంలో ఆలయ కమిటీ, జాలర్ల సంఘం సొసైటీ ఆధ్వర్యంలో అమ్మవారి జాతర మహోత్సవాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రారంభించారు. అమ్మవారిని దర్శించుకుని పూజ కార్యక్రమాలతో అమ్మవారి జాతరను ప్రారంభించారు. ఆలయ కమిటీ, జాలర్ల సంఘం సొసైటీ సాంప్రదాయ బద్దంగా ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆలయ కమిటీ, జాలర్ల సంఘం సొసైటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.