విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, భద్రత కోసం పాటుపడతాం

Sakshitha news

విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, భద్రత కోసం పాటుపడతాం…

రావులపాలెంలో పెన్షనర్స్ బిల్డింగ్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…

విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం, గౌరవం,భద్రత కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున పూర్తి కృషి చేస్తామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఆదివారం రావులపాలెంలో మండల పెన్షనర్స్ బిల్డింగ్ నిర్మాణానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. సమాజ నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగుల సేవలు మరువలేనివని, పదవీ విరమణ తర్వాత కూడా వారి అనుభవం ఎంతో విలువైనదని తెలిపారు.